ముగించు

కేసీఆర్ కిట్

తేది : 02/07/2017 - | రంగం: గవర్నమెంట్ అఫ్ తెలంగాణ
కె.సి.ఆర్ కిట్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘అమ్మ ఒడి’ పథకంలో భాగంగా ‘కేసీఆర్ కిట్’  పంపిణి చేస్తున్నారు.

కేసీఆర్ కిట్లు పొందాలంటే గర్భస్త పరీక్షలు చేయించుకోవడంతో పాటు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలు వారిపేరు మీద తెరిచి ఉండాలి. దీనికితోడు ఆధార్ సంఖ్య తప్పనిసరి. పరీక్షలు చేయించుకోవడంతో పాటు బ్యాంకు అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్లు ఉంటేనే వారికి మదర్ చైల్డ్ (ఎంసీ) కార్డులిస్తారు. కేసీఆర్ కిట్ కు అర్హులుగా గర్బిణీలను స్థానిక ఏఎన్ఎంలతో పాటు ఆశావర్కర్లు ఎంపిక చేస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం జరిగే మహిళలకు రూ.12వేలు నగదు (ఆడబిడ్డ పుడితే రూ.13వేలు) ప్రొత్సాహాన్ని మూడు విడతలుగా అందిస్తారు. ప్రసవం సమయంలో కొంత, శిశువుకు మూడు నెలలు నిండాక మరికొంత, తొమ్మిది నెలలు నిండాక టీకాలు, వ్యాక్సిన్లు వేయిస్తే మిగిలిన అమౌంట్ వారి ఖాతాల్లో జమ చేస్తారు.

లబ్ధిదారులు:

గర్బిని మహిళలు

ప్రయోజనాలు:

గవర్నమెంట్ ఆసుపత్రి లో ప్రసవాలు పెంచడం