మిషన్ భగీరథ
తేది : 06/08/2016 - | రంగం: గవర్నమెంట్ అఫ్ తెలంగాణ

మిషన్ భగీరథ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ను ప్రారంభించింది.
మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ 2016, ఆగస్టు 7 ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు గజ్వేల్ శాసన నియోజకవర్గం లోని కోమటిబండలో ఆవిష్కరించారు.
లక్ష్యాలు
- తాగునీటి సమస్యలను తీర్చడం
- స్వచ్ఛమైన మంచినీరు అందించడం
- మూడు సెగ్మెంట్లలో పనులన్నీ పూర్తి చేసి, 2019 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటుచేసి, సురక్షిత మంచినీటిని అందించాలనే ఆశయం
లబ్ధిదారులు:
పబ్లిక్
ప్రయోజనాలు:
ప్రతి ఒక్కరికి త్రాగు నీరు అందించడం