ముగించు

రైతు బంధు

తేది : 10/05/2018 - | రంగం: గవర్నమెంట్ అఫ్ తెలంగాణ
రైతు బంధు పథకం, తెలంగాణ

వ్యవసాయ రుణదాతకు రుణ విపత్తుకి గురికాకుండా,”వ్యవసాయ పెట్టుబడుల మద్దతు పథకం” (“రైతు బంధు”) అనే కొత్త పథకం, 2018 నుండి,
ఖరీఫ్ (వనాకాలం) సీజన్, ప్రతి రైతుల ప్రారంభ పెట్టుబడుల అవసరాలను తీర్చడానికి.

ఈ కొత్త పథకం వ్యవసాయం మరియు ఉద్యాన పంటలకు పెట్టుబడుల మద్దతు అందించడానికి ప్రతిపాదించబడింది.
పంట సీజన్ కోసం రైతులకు అవసరమయే  (1) విత్తనాలు, (2) ఎరువులు, (3) పురుగుమందులు, (4) లేబర్ మరియు ఇతర పెట్టుబడుల కొరకు ప్రతి సీజన్లో రైతుకు ఎకరానికి 4000 / –  రూ.లు అందజేయబడును.

 ఈ పథకం గురించి సూచనలు మరియు ఎలా అమలు పరచాలో జి.వొ. 231 లో పొందుపరిచారు. ఇందులో భాగంగా మొదటి సమావేశం సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రైతు బంధు  పథకం మీద వివిధ అధికారులకు అవగాహన కల్పించారు.

శ్రీ. సి. పార్థసారథి, APC & ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ అఫ్ తెలంగాణ.  అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ (రైతు బంధు) లో పాల్గొన్న అధికారులకు బాధ్యతలు గురించి వివరించారు.

 

లబ్ధిదారులు:

రైతులు

ప్రయోజనాలు:

రైతులకు ఆర్ధిక సహాయం అందజేయడం