డివిజన్ను మండలాలు గా విభజించారు. మండలానికి తహసిల్దారు అధికారిగా వుండును.మండల రెవిన్యూ కార్యాలయమునకు మండల రెవిన్యూ అధికారి వుంటాడు. మండల రెవిన్యూ అధికారి తన అధికార పరధిలో వున్న ప్రభుత్వము మరియు ప్రజల మధ్య సమన్వయము కుదుర్చును. ఇతడు తన అధికార పరిధిలో సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టును. సమాచారము సేకరించుటలోను, విచారణలు జరుపుటలోను, ఉన్నత అధికారులకు మండల రెవిన్యూ అధికారి సహకరించును పరిపాలనలో ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకొనుటకు జిల్లా పరిపాలనకు తన అభిప్రాయములను వెల్లడిపరుచును.
డిప్యూటీ తహసీల్దార్ లేక సూపరింటెండెంట్ (పర్యవేక్షణాధికారి), మండల రెవిన్యూ ఇన్ స్పెక్టర్, సూపరింటెండెంట్, మండల సర్వేయర్, సహాయ గణాలకు అధికారి మరియు ఇతర మంత్రివర్గ సిబ్బంది. డిప్యూటీ తహసిల్దార్ మండల రెవిన్యూ కార్యాలయములో రోజువారీ పనులను పర్యవేక్షించును మరియు ముఖ్యముగా సామాన్య పరిపాలనలో పాల్గొనును. చాలా దస్త్రములు ఇతని ద్వారానే జరుగును. మండల రెవిన్యూ కార్యాలయములో అన్ని విభాగములు ఇతని ద్వారా పర్యవేక్షించబడును.
మండల రెవిన్యూ ఇన్ స్పెక్టర్ విచారణలు జరుపుటలో, తనిఖీలు చేయుటలో మండల రెవిన్యూ అధికారికి సహకరించును. ఇతడు గ్రామా కార్యదర్శులను పర్యవేక్షించును. ఇతడు పంటపొలాలను తనిఖీచేయును (అజిమాయిషి), షరాలు, పహనీలో వ్రాయును (క్షేత్ర తనిఖీల వివరములు). ఇతడు భూమి శిస్తును, వసూలు చేయును, వ్యవసాయేతర భూముల విశ్లేషణ మరియు బకాయిలు, మొదలగు వాటిని తన న్యాయపరిధిలో చట్టము మరియు ఆజ్ఞ కొరకు గ్రామములను పరిశీలించును. రాష్ట్రస్థాయిలో జిల్లా మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో ముఖ్య ప్రణాళిక అధికారి అద్వర్యంలో పనిచేయు సహాయ గణాంక అధికారి వర్షపాతము, పొలాలు, జనభాకు సంబందించిన వివరములను సేకరించును. ఇతడు పంటల అంచనా పరీక్షలను నిర్వహించును. ఇతడు పంట పొలాల యొక్క స్థితుల వివరములను సేకరించుటకు పంటపొలాలను తనిఖీ చేయును. ఇతడు జనన మరణ వివరముల ఆవర్తక నివేదికలు తయారుచేయును. కాలానుగుణముగా ప్రభుత్వము నిర్వహించు పశు గణాంకములు, జనాభా లెక్కలు ఇతర సర్వేలు జరుపుటలో మండల రెవిన్యూ అధికారికి సహకరించును. మండల రెవిన్యూ అధికారి ఫై విషయములకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టరుకు అందజేయును. తరువాత ఈ నివేదికలు ఎకనామిక్స్ మరియు స్టాటిస్టిక్స్ మరియు ప్లానింగ్ శాఖలకు పంపించబడును.
వ సం | రెవిన్యూ డివిజన్ | మండలాలు |
---|---|---|
1 | సంగారెడ్డి | సంగారెడ్డి |
2 | సంగారెడ్డి | కంది |
3 | సంగారెడ్డి | కొండాపూర్ |
4 | సంగారెడ్డి | సదాశివపేట |
5 | సంగారెడ్డి | పటానచెరువు |
6 | సంగారెడ్డి | అమీన్ పుర్ |
7 | సంగారెడ్డి | రామచంద్రాపురం |
8 | సంగారెడ్డి | మునిపల్లి |
9 | సంగారెడ్డి | జిన్నారం |
10 | సంగారెడ్డి | గుమ్మడిదల |
11 | సంగారెడ్డి | హత్నూర |
12 | ఆందోల్ | ఆందోల్ |
13 | ఆందోల్ | వట్పల్లి |
14 | ఆందోల్ | పుల్కల్ |
15 | ఆందోల్ | చౌటకుర్ |
16 | జహీరాబాద్ | జహీరాబాద్ |
17 | జహీరాబాద్ | మొగుడంపల్లీ |
18 | జహీరాబాద్ | న్యాల్కల్ |
19 | జహీరాబాద్ | ఝారాసంగం |
20 | జహీరాబాద్ | కోహిర్ |
21 | జహీరాబాద్ | రాయికోడ్ |
22 | నారాయణఖేడ్ | నారాయణఖేడ్ |
23 | నారాయణఖేడ్ | కంగ్టి |
24 | నారాయణఖేడ్ | కల్హేర్ |
25 | నారాయణఖేడ్ | సిర్గాపూర్ |
26 | నారాయణఖేడ్ | మనూర్ |
27 | నారాయణఖేడ్ | నాగల్గిద్ద |
28 | నారాయణఖేడ్ | నిజాంపేట్ |