ముగించు

తీర్థయాత్ర పర్యాటక రంగం

Kethaki Sangameshwara Temple, Jharasangam

శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం

 

ఝారాసంగం:

రాష్ట్రము లోని ప్రసిద్ద దేవాలయాలలో ఇది ఒకటి. జహీరాబాద్ పట్టణం నుండి 16 కి.మీ దూరం లో ఉంది.ఈ ఆలయాన్ని దక్షిణ కాశి అని పిలుస్తారు. ఈ ఆలయంలోని వనమును కేతకి వనము అని, ఇచట శౌనకాది మునులు యజ్ఞం చేసినట్లు పురాణాల ద్వార తెలుస్తుంది. మహాశివరాత్రి సందర్బంగా ఇచట ప్రతి సం.వ ఉత్సవాలు జరుగుతాయి.

 

 

Sri Veerabhadra Swamy Temple, Bonthapally

 శ్రీ వీరభద్ర స్వామి ఆలయం

 

 

                                                              బొంతపల్లి: హైదరాబాద్ మెదక్ రోడ్డు ఫై వీరభద్రస్వామి భద్రకాళి సమేతుడై ముక ద్వారం ఫై భక్తులను ఆశిర్వదిన్చుచున్నాడు. వీరశైవ కాలం లో ఈ దేవాలయం కట్టబడినది.

 

 

 

Sri Bhramarambhika Mallikharjuna Swamy Temple, Beeramguda

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున ఆలయం

 

భీరంగూడ: రెండవ శ్రీశైలంగా పేరుగాంచిన ఈ ఆలయం 13 వ  శతాబ్దంలో వేలిసిందని చారిత్రక ఆధారం. పటాన్చెరు మండలం లో ని అమీన్ పూర్ పరిధిలో బీరంగూడ గుట్ట ఫై ఈ దేవాలయం ఉన్నది. శివరాత్రి సందర్బంగా ఇక్కడ 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.

 

 

 

Sri Kashi Vishweshwara Temple, kalbagur

శ్రీ కాశి విశ్వేశ్వర ఆలయం

 

                                                          త్రికూట ఆలయం: ఈ ఆలయాన్ని నిర్మించినవారు కాకతీయ రాజులు. ఈ ఆలయం 11-13 శాతబ్దంలో నిర్మించింది. సంగారెడ్డి పట్టణానికి 4 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం త్రికూట పద్దతిలో నిర్మింపబడింది.