ముగించు

కలెక్టరేట్

జిల్లా పరిపాలన నిర్వహణలో కలెక్టరేట్ ఆధార కేంద్ర బిందువు పాత్రగా వ్యవహరించును. జిల్లాకు ఐ.ఎ.ఎస్. హోదా కలిగిన అధికారి కలెక్టరు. కలెక్టరు న్యాయ వ్యవస్థ యొక్క అధికార పరిధిలో శాంతి భద్రతలను కాపాడుటకు జిల్లా న్యాయాధికారిగా పనిచేయును. ప్రధానముగా ప్రణాళిక మరియు అభివృద్ధి, శాంతి భద్రతలు, షెడ్యుల్డ్ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, సామాన్య ఎన్నికలు, ఆయుధ లైసెన్సులు మొదలగు వ్యవహారములను పరిశిలించును.

 

ఐ.ఎ.ఎస్. హోదా కలిగిన జాయింట్ కలెక్టర్ జిల్లలో శాసనముల ప్రకారము రెవిన్యూ పరిపాలన నిర్వహణ చేయును. ఇతడు అదనపు జిల్లా న్యాయమూర్తిగా కూడా హోదా కల్గియుండును. ఇతడు ప్రధానముగా పౌరసరఫరాలు, భూ సంబంధ విషయములు పరిశీలించును.

కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ల విధి నిర్వహణలో జిల్లా రెవిన్యూ అధికారి (డి.ఆర్.ఓ.) స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టరు హోదాలో సహాయకుడు వ్యవహరించును. జిల్లా రెవిన్యూ అధికారి కాలేక్టరట్ లోని అన్ని శాఖలను నిర్వహించును. ఇతడు ముఖ్యముగా కలెక్టరేట్ లో జరుగు రోజువారీ కార్యక్రమములను పర్యవేక్షించుచూ సామాన్య పరిపాలన నిర్వహణను పరిసిలించును.

కలెక్టరుకు సామాన్య సహాయకుడుగా తహసీల్దారు హోదాలో పరిపాలనా నిర్వహణాధికారిగా వ్యవహరించును. ఇతడు కలెక్టరేట్ లోని అన్ని విభాగములను ప్రత్యక్షముగా పర్యవేక్షించును మరియు చాలా వరకు దస్త్రములన్ని (ఫైల్స్) వీరి ద్వారానే పంపబడును.

పరిపాలన సౌలభ్యము కొరకు కలెక్టరేట్ ఎనిమిది విభాగములుగా విభజించబడినది. సులభముగా తెలుసుకొనుటకు ప్రతి విభాగమునకు ఆంగ్ల వర్ణమాలలోని అక్షరములు వరుసగా ఇవ్వబడినది.

సెక్షన్ A : శాఖల స్థాపన మరియు కార్యాలయ ప్రక్రియలు నిర్వహణ.
సెక్షన్ B : జమా ఖర్చులు మరియు ఆర్ధిక లావాదేవీల అధికార పరిశీలనల నిర్వహణ.
సెక్షన్ C : న్యాయ పరమైన (న్యాయ స్థానము/చట్ట పరమైన) విషయాల నిర్వహణ.
సెక్షన్ D : భూ రెవిన్యూ మరియు ఉపశమనముల నిర్వహణ.
సెక్షన్ E : భూ పరిపాలనా నిర్వహణ.
సెక్షన్ F : భూ సంస్కరణల నిర్వహణ.
సెక్షన్ G : భూ సంక్రమణల నిర్వహణ.
సెక్షన్ H : దౌత్య మర్యాదలు, ఎన్నికలు మరియు మిగిలిన పనుల నిర్వహణ.