ముగించు

చరిత్ర

పూర్వం అందోల్ రాజ్యాని 24 పరగణాలుగా విభజింఛి పరిపాలించిన రాయబాగిన్ మహా రాణి శంకరమ్మ  1702 వ సంవత్సరo లో సంగారెడ్డి పట్టణానికి సుమారు 12 కి.మీ దూరంలో ఉన్న గౌడిచర్ల గ్రామంలో జన్మించింది. ఆమె తల్లి పేరు రాజమ్మ, తండ్రి పేరు సంగారెడ్డి. భర్త పేరు వెంకట నరసింహారెడ్డి. తన భర్త శత్రువుల చేతిలో హత్య చేయబడ్డ తర్వాత భర్త ఆశయాలను నిలుపడానికి, అత్తమామల ఆజ్ఞతో  అందోల్ రాజ్యాని పరిపాలించింది. శంకరమ్మ  తండ్రి పేరున వెలిసిన ప్రస్తుత పట్టణమే సంగారెడ్డి. వారి తల్లి పేరున ఉన్న గ్రామం రాజంపేట. ఆమె పెంపుడు కొడుకైన సదాశివరెడ్డి పేరున ఉన్న నేటి పట్టణం సదాశివపేట.

 

సంగారెడ్డి పట్టణం పూర్వం మెదక్ జిల్లా కేంద్రంగా ఉండేది.      జి. వొ. ఎంఎస్. నెం. 239; తేది 11-10-2016 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు ఉత్తరువుల ప్రకారం మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించారు. అవి.

1. సంగారెడ్డి జిల్లా 2. మెదక్ జిల్లా ౩.సిద్ధిపేట  జిల్లా.