ముగించు

జిల్లా గురించి

ప్రొఫైల్

సంగారెడ్డి పట్టణం పూర్వం మెదక్ జిల్లా కేంద్రంగా ఉండేది.  జి. వొ. ఎంఎస్. నెం. 239; తేది 11-10-2016 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు ఉత్తరువుల ప్రకారం మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించారు. అవి.  1. సంగారెడ్డి జిల్లా 2. మెదక్ జిల్లా ౩.సిద్ధిపేట  జిల్లా.

భౌగోళిక స్థితి:

సంగారెడ్డి జిల్లా మొత్తం 4,464.87 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం ఉంది.

డెమోగ్రఫి

2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 15,27628 జనాభా ఉంది.

రెవిన్యూ డివిజన్స్

సంగారెడ్డి జిల్లాకు 3 రెవిన్యూ డివిజన్లు, 26 మండలాలు ఉన్నాయ్. అవి.

  1. సంగారెడ్డి డివిజన్   2. జహీరాబాద్ డివిజన్     ౩. నారాయణఖేడ్ డివిజన్

సివిక్ అడ్మినిస్ట్రేషన్

సంగారెడ్డి మున్సిపాలిటీ 1954 లో ఏర్పాటు చేయబడింది. ఈ మున్సిపాలిటీని 31 వార్డ్స్ గా విభజించారు. ఈ మున్సిపాలిటీ యొక్క విస్తీర్ణం 13.69 కి.మీ.

ఎకానమీ

ప్రభుత్వ రంగ సంస్థలలో బిహెచ్ఇల్ (రాంచంద్రపూర్), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ఓడిఎఫ్ – ఎద్దుమైలారం), బిడిఎల్ ఫ్యాక్టరీలు ప్రధానమైనవి. పటాన్చేరు ప్రాంతంలోని ఎన్నో ఫ్యాక్టరీలు పారిశ్రామిక రంగంలో ప్రపంచంలోనే కీర్తిగాంచాయీ.  సదాశివపేటలోని ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ, జహీరాబాద్ సమీపంలోని మహేంద్ర ఫ్యాక్టరీ, ఇస్నాపూర్ దగ్గరలోని ఆరబిందో కెమికల్ ఫ్యాక్టరీ మొదలగునవి ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయ్.

సంగారెడ్డి పట్టణం రెండు విభాలుగా ఉన్నది. పాత సంగారెడ్డి మరియు కొత్త సంగారెడ్డి. పాత సంగారెడ్డి యందు పాత జిల్లా కర్మాగారం ఉంది కాని ఇప్పుడు దీని మ్యుజియంగా మార్చేసారు. పండుగల సమయాలలో పాత సంగారెడ్డి బాగా రద్దీగా ఉంటుంది.

విద్యారంగం

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి – హైదరాబాద్) సంగారెడ్డి పట్టణానికి  5 కి.మీ దూరం లో ఉంది. 2008 ఆగస్ట్ నెలలో ఏర్పడింది.

రోడ్డు మార్గం

సంగారెడ్డి హైదరాబాద్ కు సమీపంలో ఉన్నందున హైటెక్ నగరం, డిఎల్ఎఫ్ గాచిబౌలి (35 కిలోమీటర్ల దూరం), పంజాగుట్ట, సికింద్రాబాద్ వంటి ఇతర ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది. NH-65 నగరం గుండా వెళుతుంది. సంగారెడ్డికి రెండు బస్ స్టేషన్లు ఉన్నాయి, ఓల్డ్ ఓల్డ్ ఆర్డినరీ సర్వీస్ మరియు లగ్జరీ మరియు ఇతర సేవలకు కొత్తవి.
సంగారెడ్డి నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాంషాబాద్ విమానాశ్రయం – రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాదు మరియు గచ్చిబౌలీ మరియు మెడ్చల్ లతో అనుసంధానించే ఔటర్ రింగ్ రోడ్డు ఉంది.

రైల్ మార్గం

సంగారెడ్డికి సమీపం లో లింగంపల్లి రైల్వే స్టేషన్ 30 కి.మీ., సికింద్రాబాద్ స్టేషన్ 50 కిలోమీటర్లు మరియు నాంపల్లి స్టేషన్ 55 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో నగరాన్ని లింగంపల్లికి కనెక్ట్ చేయడానికి మెట్రో రైలు/MMTS ట్రాక్ ఉంటుంది.