ముగించు

పథకాలు

Filter Scheme category wise

వడపోత

రైతు బంధు

వ్యవసాయ రుణదాతకు రుణ విపత్తుకి గురికాకుండా,”వ్యవసాయ పెట్టుబడుల మద్దతు పథకం” (“రైతు బంధు”) అనే కొత్త పథకం, 2018 నుండి, ఖరీఫ్ (వనాకాలం) సీజన్, ప్రతి రైతుల ప్రారంభ పెట్టుబడుల అవసరాలను తీర్చడానికి. ఈ కొత్త పథకం వ్యవసాయం మరియు ఉద్యాన పంటలకు పెట్టుబడుల మద్దతు అందించడానికి ప్రతిపాదించబడింది. పంట సీజన్ కోసం రైతులకు అవసరమయే  (1) విత్తనాలు, (2) ఎరువులు, (3) పురుగుమందులు, (4) లేబర్ మరియు ఇతర పెట్టుబడుల కొరకు ప్రతి సీజన్లో రైతుకు ఎకరానికి 4000 / –  రూ.లు అందజేయబడును.  ఈ పథకం గురించి సూచనలు మరియు ఎలా అమలు పరచాలో జి.వొ….

ప్రచురణ తేది: 25/04/2018
వివరాలు వీక్షించండి

మిషన్ భగీరథ

మిషన్ భగీరథ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ను ప్రారంభించింది. మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ 2016, ఆగస్టు 7 ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు గజ్వేల్ శాసన నియోజకవర్గం లోని కోమటిబండలో ఆవిష్కరించారు. లక్ష్యాలు తాగునీటి సమస్యలను తీర్చడం స్వచ్ఛమైన మంచినీరు అందించడం మూడు సెగ్మెంట్లలో పనులన్నీ పూర్తి చేసి, 2019 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటుచేసి, సురక్షిత మంచినీటిని అందించాలనే ఆశయం

ప్రచురణ తేది: 24/04/2018
వివరాలు వీక్షించండి

కేసీఆర్ కిట్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘అమ్మ ఒడి’ పథకంలో భాగంగా ‘కేసీఆర్ కిట్’  పంపిణి చేస్తున్నారు. కేసీఆర్ కిట్లు పొందాలంటే గర్భస్త పరీక్షలు చేయించుకోవడంతో పాటు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలు వారిపేరు మీద తెరిచి ఉండాలి. దీనికితోడు ఆధార్ సంఖ్య తప్పనిసరి. పరీక్షలు చేయించుకోవడంతో పాటు బ్యాంకు అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్లు ఉంటేనే వారికి మదర్ చైల్డ్ (ఎంసీ) కార్డులిస్తారు. కేసీఆర్ కిట్ కు అర్హులుగా గర్బిణీలను స్థానిక ఏఎన్ఎంలతో పాటు ఆశావర్కర్లు ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం జరిగే మహిళలకు రూ.12వేలు నగదు (ఆడబిడ్డ పుడితే రూ.13వేలు) ప్రొత్సాహాన్ని మూడు విడతలుగా అందిస్తారు. ప్రసవం సమయంలో కొంత,…

ప్రచురణ తేది: 23/04/2018
వివరాలు వీక్షించండి

కళ్యాణ లక్ష్మి

ఈ పథకాని సి.యం. కె.సి.ఆర్ 2015 అక్టోబర్ 2 న ప్రారంభించారు. స్.సి, స్.టి, బి.సి లకు చెందిన నిరుపేద యువతుల వివాహం కోసం రూ. 100016 అందజేస్తున్నారు.

ప్రచురణ తేది: 22/04/2018
వివరాలు వీక్షించండి

తెలంగాణ కు హరిత హారం

ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలకూరు బాలాజీ దేవాలయం లో  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేకర్ రావు గారు అదికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

ప్రచురణ తేది: 21/04/2018
వివరాలు వీక్షించండి